FRA 2006 AWARNESS PROGRAMM

 

  అటవీ హక్కుల చట్టం-2006’  పై అవగాహన సదస్సు  కార్యక్రమం- 2022.

గ్రామం: బందమానుగూడ                   మండలం: సీతంపేట                     జిల్లా: శ్రీకాకుళం తేదీ: 02/03/2022.                      సమయం: ఉ. 8 గం,నుండి 10  గం వరకు.              ఆంధ్రప్రదేశ్.

ఎజెండ:

ప్రార్ధన,

పరిచయం,

హాజరు; 25 మంది  

అటవీ హక్కుల చట్టం-2006, ప్రభుత్వ పధకాలు-నవరత్నాలు మరియు ఆదివాసీ పేద ప్రజల జీవనోపాధి ల  పై అవగాహన సదస్సు  కార్యక్రమం.

                         ఈ దినమున, అనగా తేదీ/02/03 /2022  బుధవారం  నాడు, బందమాణుగూడ  గ్రామం, కుడ్డపల్లి -పంచాయతీ,  సీతంపేట- మండలం, శ్రీకాకుళం- జిల్లా లో అటవీ హక్కుల చట్టం-2006, ప్రభుత్వ పధకాలు-నవరత్నాలు మరియు ఆదివాసీ పేద ప్రజల జీవనోపాధి ల పై ఒక అవగాహ సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం జరిగినది.

అంశం-1: సమావేశంలో ముందుగా, జీవితాన గెలుపుoదని ప్రార్ధన గీతముతో ప్రారంభించుకుంటిమీ.

అంశం-2: సమావేశములో వచ్చిన ప్రతి ఒక్కరు, తమ తాము పేర్లును తెలిజచుకుంటూ పరిచయం చేచుకుంటిమీ.

అంశం-3: సమావేశనికి  25  మంది వరకు ఆడవారు మరియు మగవారు హాజరైటీమీ.




                         ఈ సమావేశములో   అటవీ హక్కుల చట్టం-2006, ప్రభుత్వ పధకాలు-నవరత్నాలు మరియు ఆదివాసీ పేద ప్రజల జీవనోపాధి కల్పన అనే అంశాల పై మాట్లాడుకోవటం మరియు చర్చిoచుకోవటం జరిగినది. సమావేశములో ఫీల్డ్ అసిస్టెంట్ nregs నుండి, గ్రామ వాలంటీర్. అటవీ హక్కుల కమిటీ సభ్యులు, cws స్టాఫ్- FEWs,cws -వాలంటీర్స్,మహిళా సంఘాల సభ్యులు, వార్డు మెంబర్లు,గ్రామ పెద్దలు, యువతి-యువకులు హాజరైనారు.


 Cws-సిబ్బంది మరియు కమ్యూనిటి మొబిలైజర్ ఆరిక విజయ్  ప్రసంగం:-

Cws-సిబ్బంది మరియు కమ్యూనిటి మొబిలైజర్ గా నేను ఉదయం 7.56   గంటలకు బందమాణుగూడ గ్రామానికి చేరుకోవటం జరిగినది. Cws –సిబ్బంది మరియు కమ్యూనిటి మొబిలైజర్ 10 గ్రామాలలో పని చేస్తున్న నేను, అనగా ఆరిక విజయ్, “అటవీ హక్కుల చట్టం-2006, ప్రభుత్వ పధకాలు-నవరత్నాలు మరియు ఆదివాసీ పేద ప్రజల జీవనోపాధి కల్పన అనే అంశాలను వివారించి తెలిజేయటం జరిననది. గ్రామ్యంలో గల వివిధ రకాల సమస్యలను/ఇబ్బందులను అడిగి తెలుసుకివటం జరిగినది. కొండపోడు పట్టాలు, త్రాగు నీరు, సి. సి. రోడ్డు, అటవీ ఫలసాయం, సంప్రదాయ పంటలు, కొండపోడు వ్యాసాయం పై పంటలు. పంటల దిగుబడి,వాటి గిట్టుబాటు ధర మరియు అటవీ ఫలసాయం మార్కెటింగ్, వాటి లాభాలు/ప్రయోజనాలు గురించి వివారిస్తూ అవగాహన కల్పించటం జరిగినది.






అటవీ హక్కుల చట్టం-2006 లో భాగంగా, అడవి, భూమి,నీరు సద్వినియోగం, ఉపయోగం మరియు వాటి ప్రయోజనం గూర్చి చర్చిo చుకోవటం జరిగినది. ఈ అవగాహన సదస్సు కార్య క్రమంలో, అటవీ ఫలసాయం/అటవీ ఉత్పత్తుల లైన అడ్డకులు, చీపురు,నర్రమాడి చెక్క లాంటివి అడవి సేకరించి, కుటీర పరిశ్రమ పున. స్థాపన చేయాలని గ్రామస్తులతో చర్చిoచుకోవటం జరిగినది. చీపురు పంట మరియు చీపురులు పండించే మహిళా రైతులను గుర్తిచటం జరిగినది. గ్రామ సమస్యలు, వరదగోడ ఆవశ్యకత, వృధాగా ఉన్ననూయిలను సందర్శిo చి, ఎత్తి పోతల పధకం ద్వారా ప్రయోజనాలను పొందేలా ఉంప్రజలకు అవగాహన కలిపించటం జరిగినది.నూతనం గా నిర్మించిన బోరు మోటారును ద్వారా కూరగాయాలు పండిచాలని సూచించటం జరిగినది. సంప్రదాయ పంటలు పండించాలని, నూతనంగా ఏర్పాటు చేసిన సవర మాలమ్మ షాపును పరిశీలంచటం జరిగినది. అదేవిధంగా కొండపోడు భూములు, కొండపోడు పట్టాలు గూర్చి చర్చిo చు కోవటం జరిగినది.




                                               ...................................ముగింపు...........................

                                      

 

 

                                                                        

 

 

  


No comments:

Post a Comment

NTWA 2008 ACHIEVEMENTS and PROGRESS REPORTS.

                                నవోదయ   ట్రైబల్   వెల్ఫేర్   అసోసియేషన్                                                    రిజిస్టర...