FRA, PESA and RTI Acts Training Programm

     

 అటవీ హక్కుల  చట్టం, PESA చట్టం మరియు సమాచార  హక్కు చట్టం

   పై  శిక్షణా  కార్యక్రమం -2022.  

     గ్రామం: నీలoగూడ           మండలం: సీతంపేట                  శ్రీకాకుళం - జిల్లా                           తేదీ: 16/03 /2022.      సమయం: 10 గం,నుండి సా 4:30 గం వరకు.       ఆంధ్రప్రదేశ్. 

  ఎజెండ:-

  ప్రార్ధన,

 పరిచయం:-

  హాజరు: 35 మంది.                                                                                          

                              


ఒక‘అటవీ హక్కుల చట్టం-2006’, షెడ్లూల్డు ప్రాంత విస్తరణ చట్టం-1998, సమాచార హక్కు చట్టం -2005 పై  శిక్షణా  కార్యక్రమం.

                   ఈ  దినమున, అనగా తేదీ /16 /03 /2022, బుధవారం  నాడు, నీలoగూడ -గ్రామం, ఈతమానుగూడ-పంచాయతీ,  సీతంపేట- మండలం, శ్రీకాకుళం- జిల్లా లో ‘అటవీ హక్కుల చట్టం-2006’, షెడ్లూల్డు ప్రాంత విస్తరణ చట్టం-1998, సమాచార హక్కు చట్టం -2005  పై ఒక శిక్షణా  కార్యక్రమాన్ని  ఏర్పాటు చేసుకోవటం జరిగినది.

అంశం-1:  శిక్షణా కార్య క్రమం లో ముందుగా, ‘యువతరం శిరమెత్తితే- నవతరం గళమెత్తితే చీకటే మారిపోదా,చీకటే మాసిపోదా’ అనే పాటతో  ప్రారంభించుకుంటిమీ.

అంశం-2:  శిక్షణా  కార్య క్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు,  కాగితం ముక్కలు ఇచ్చి దాన్ని పై నచ్చిన బొమ్మను గీసి/వ్రాస్తూ తద్వారా  తమ తాము పేర్లును తెలిజచుకుంటూ పరిచయం చేచుకుంటిమీ.

అంశం-3:  శిక్షణా  కార్య క్రమానికి   మగవారు =16 , ఆడవారు=19 , మొత్తం=35  మంది    ఆడవారు మరియు మగవారు హాజరైటీమీ. ఈ శిక్షణా కార్య క్రమానికి  విశాఖపట్నం  లయ ఆఫీసు నుండి,

శ్రీ K కాంతారావు  గారు రిసోర్స పర్సన్ గా హాజరైనారు. వార్డు మెంబర్లు, గ్రామ వోలునటీర్లు, అంగన్వాడీ టీచర్, అటవీ హక్కుల కమిటీ సభ్యులు,  cws- సిబ్బంది & cws- వోలునటీర్లు, మహిళ సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు,  మరియు యువతి –యువకులు, ఈ శిక్షణా కార్య క్రమo లో పాల్గొనతీరి.



                      ఈ శిక్షణా కార్య క్రమం లో  ముఖ్యంగా  ‘అటవీ హక్కుల చట్టం-2006’, షెడ్లూల్డు ప్రాంత విస్తరణ చట్టం-1998, సమాచార హక్కు చట్టం -2005  పై ఉదయం 10 గంటలు నుండి సాయంత్రం 4:30 గంటలు వరకు శిక్షణా తరగతిని ఏర్పాటు చేసుకుంటిమీ.

    CWS  సిబ్బంది  కమ్యూనిటి  మొబిలైజర్ ఎ.విజయ్ ప్రసంగం:-


Cws-సిబ్బంది మరియు కమ్యూనిటి మొబిలైజర్ గా నేను (ఆరిక విజయ్ ), ఉదయం 9:30  గంటలకు నీలoగూడ  గ్రామానికి చేరుకోవటం జరిగినది.

Cws –సిబ్బంది మరియు కమ్యూనిటి మొబిలైజర్, 5  పంచాయతీ లో మరియు 15  గ్రామాలలో పని చేస్తున్న నేను, అనగా ఆరిక విజయ్, “అటవీ హక్కుల చట్టం-2006, షెడ్లూల్డు ప్రాంత విస్తరణ చట్టం-1998, సమాచార హక్కు చట్టం -2005  గూర్చి వాటి ప్రాముక్యత, శిక్షణా కార్య క్రమలో ఉద్దేశ్యం, లయ - నుండి వచ్చిన రిసొర్స పర్సన్ K కాంతారావు  గారు, పరిచయం చేస్తూ మాట్లాడటం జరిగినది. మరియు శిక్షణా కార్య క్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు శిక్షణా తరగతిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవలిసినదిగా కోరడం జరిగినది.

                  లయ - రిసోరసు పర్సన్, K కాంతారావు గారు  ప్రసంగం:- 





                 ఈ ఒక రోజు శిక్షణా కార్య క్రమానిలో  ‘అటవీ హక్కుల చట్టం -2006’ షెడ్లూల్డు ప్రాంత విస్తరణ చట్టం-1998, సమాచార హక్కు చట్టం -2005 పై శిక్షణా తరగతిని నిర్వహించుకోవటం జరిగినది. ఈ  శిక్షణా కార్య క్రమానికి లయ -ఆఫీసు విషపట్నం  నుంచి రిసోరసు పర్సన్ గా  శ్రీ K కాంతారావు గారు, ఈతమానుగూడ -పంచాయతీ, నీలoగూడ గ్రామానికి ఉదయం 10 గంటలకు హాజరైనారు. ఆ  తరువాత ‘యువతరం శిరమెత్తితే- నవతరం గళమెత్తితే చీకటే మారిపోదా,చీకటే మాసిపోదా’ అనే పాటతో  ప్రారంభించుకుంటిమీ.


‘అటవీ హక్కుల చట్టం-2006’:- 

 ‘అటవీ హక్కుల చట్టం-2006’ ను ముఖ్యంగా 2007 సoవత్సరం, డిసెంబర్ తేదీ/31/12/2007 నుండి అమలులోకి వచ్చిందని చెప్పారు. అదే విధంగా అటవీ ప్రాంతములో నివాసిస్తున్న గిరిజనులు మరియు ఆదివాసుసులు వారు సాగు చేసుకుంటున్నకొండ పోడు భూములకు హక్కులు/పట్టాలు రావాలంటే, 2005 సoవత్సరం నాటికి గాని  2005 డిసెంబర్ 13 నాటికి ముందు సాగులోనికి ఉన్న వారు మాత్రమే, అటవీ హక్కుల హక్కు పత్రాలు /RoFR పట్టాన్ని పొందుటానికి అర్హుడు అవుతారని తెలియజేశారు. అదే విధంగా ఈ హక్కు పత్రములో గిరిజనులు/ఆదివాసులకు ముఖ్యంగా 8 రకాల హక్కులను కలిపించారని చెప్పారు. అవి 1. నివాసపు హక్కు, 2. చిన్నతరహా ఉత్పతులపై హక్కు, 3. పశువులు మేపుకొనే హక్కు, 4. మత సంబండమైన హక్కులు. 5. చేపలు పట్టుకొనే హక్కు, 6. సంప్రదాయపు అటవీ సంపద పై హక్కు, 7. ఆయుర్వేద ముక్కలపై హక్కు మరియు 8. కొండ పోడు భూముల వ్యవసాయం పై హక్కు. అని చెప్పారు.

అటవీ హక్కుల కమిటీ ఏర్పాటు ఏవిధంగా చేస్తారో కూడా వివారిచారు. అటవీ హక్కుల కమిటీ ని (FRC) ని 10 నుండి 15 మంది సభ్యులతో ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇందులో ఆడవారు మరియు మగవారు వుండాలన్నారు.2/3 వంతు కోరం తో ఏర్పాటు అవ్వాలని చెప్పారు. ఈ అటవీ హక్కుల కమిటీ ఏర్పాటుకు గ్రామ సర్పంచ్ అధ్యతన తో పంచాయతీ కార్య దర్శి, రేకార్డులను రాస్తూ సమావేశమును ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ అటవీ హక్కుల కమిటీ ని ఏర్పాటుకు, 10 నుండి 15 రోజుల కాలవ్యవధిలో గ్రామంలో దండోరా వేయించి, సమావేశమును ఏర్పాటుచేయాలని వివరించారుగ్రామ సభా ఏర్పాటుకు గ్రామంలో ఉంటున్న,18 సoవత్సరాలు వయస్సు కలిగి  ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ అర్హులు అని తెలియజేసినారు. విదేశీయులు మరియు మానసిక రొగులు ఈ కమిటీ ఉండరాదని చెప్పారు. ఈ లాంటి వారు సమవశ్యములో పాల్గొనవచ్చు, కానీ రికార్డులో/రేగిస్తారలో నమోదు చేయరాదని చెప్పారు.

 ఇవే కాకుండా, Form-B, Form-C హక్కులు, ఉమ్మడి హక్కులు పొందే హక్కు ఈ అటవీ హక్కుల చట్టం 2006 లో హక్కును కలిపించారని శ్రీనివాసులుగారు చెప్పారు. అదే విధంగా శిక్షణా తరగతికి వచ్చిన అందరినీ 3 గ్రూపు గా విభజించి, కొన్ని ప్రశనలు ఇచ్చారు. 1. అటవీ హక్కుల కమిటీ ఎవ్వరూ ఏర్పాటు చేస్తారు?, ఎంతమంది సభ్యులు వుంటారు?, 2. అటవీ హక్కుల చట్టం 2006 ద్వారా కలిపించిన  హక్కులు ఎన్ని?, 3. గ్రామ సభా ఏర్పాటు, నిర్వహణ ఎవ్వరు చేస్తారు?. గ్రామ సభా కోరo ఎంత మంది ఉండాలి?. ఎన్ని రోజుల కాలవ్యవధిలో గ్రామ సభా నిర్వహించాలి?. అనే అంశాలను శిక్షణార్డులను, చార్టుల ద్వారా వ్రాయిస్తూ ప్రశనలకు సమాధానాలు రాబట్టారు. చార్టులలో వ్రాసిన ప్రతి గ్రూప్ ల ద్వారా, వారి ద్వారా వివారించే విధం గా చెప్పారు. అదే విధంగా వ్యక్తి గత పట్టా/హక్కు కోసం Form- A ను ఎలా నింపాలి?, ఏవిధంగా అర్జీలు పెట్టాలి?. తరువాత ఆధార్ కార్డు, రేషన్, ఫోటోస్, కేస్తూ  వంటి  జిరాక్స్ కాపీలను  లను జతచేయాలని చెప్పారు. 


PESA చట్టం -1998:-

కాంతారావు, గారు PESA –చట్టం యొక్క ఉపయోగం మరియు ప్రాముఖ్యతను గూర్చి చర్చించారు. PESA చట్టం, ఇది 2012  సoవత్సరం లో నియమాలను రూపొందిచారని చెప్పారు. షెడ్లూల్డు ప్రాంత విస్తరణ చట్టం అని తెలియజేశారు. ఇది మన పరిపాలన విధానాన్ని తెలుపుతుందని తెలియజేచారు. అంటే ‘పరిపాలన’ అనగా ‘మన అవసరాలన్నీ తీర్చుకోవటానికి నిర్వహించుకొనే కార్య క్రమాలను’ పరిపాలన అంటరాని కాంతారావు గారు తెలియజేచారు. మా ఊరిలో మా రాజ్యం, గ్రామ స్వరాజ్యం, గ్రామ స్వయం పరిపాలన లాంటి అర్ధాలను ఈ PESA చట్టం చెప్పుతుందని వివరించారు. ఈ PESA చట్టం లో భాగంగా, రోడ్డు, త్రాగునీరు,వీధి ధీపాలు, భూ సమస్యలు మొదలగు వాటి సమస్యలను పరిస్కారించు కోవచ్చని చెప్పారు.


సమాచార హక్కు చట్టం -2005:-

అదే విధంగా సమాచార హక్కు చట్టం 2005 ను కూడా ఈ శిక్షణా కార్య క్రమం లో చర్చించు కోవటం జరిగినది. ఈ సమాచార హక్కు చట్టాని 2005 సoవత్సరం లో ప్రభుత్వం వారు తీసుకొచ్చారని చెప్పారు. ఈ సమాచార హక్కు చట్టం 2005 ను ఉపయోగించుకొని ప్రతి ప్రభుత్వ కార్యాలయాల నుంచి మనం అనుకొన్న సమాచారమును పొడవచ్చునని/తీసుకోవచ్చునని తెలియజేశారు. సమాచార హక్కు చట్టం ప్రతి పౌరుడుకి ఒక వజ్రాయుధం లాగా పని చేస్తుందని చెప్పారు. దీనిని ప్రతి ఒకరు తెలుసుకొని, ఉపయోగించుకోవటం నేర్చు కోవాలని శిక్షణాయార్డులను సూచించారు. ఈ శిక్షణా తరగతిలో భాగంగా, సమాచారం కోసం ధరఖాస్తులను ఏ విధంగా వ్రాయలో 4 గ్రూప్ లు గా విభజించి, 4 ప్రశ్నలను ఇవ్వటం జరిగినది. కొండ పోడు పట్టాలు, త్రాగునీరు, రోడ్డు మరియు స్కూల్ భవనం లాంటి 4 సమస్యల ప్రశ్నలను శిక్షణాయార్డులచే ధరఖాస్తులను సంభందిత కార్యాలయాలకు ఏ విధంగా చామచ్చరాన్ని పొందలో! గ్రూప్ చర్చల ద్వారా వివారించి తెలియజేశారు.

             ……………………………….. ముగింపు .. ...................................










 





 




No comments:

Post a Comment

NTWA 2008 ACHIEVEMENTS and PROGRESS REPORTS.

                                నవోదయ   ట్రైబల్   వెల్ఫేర్   అసోసియేషన్                                                    రిజిస్టర...